ETV Bharat / state

Chandrababu Land: చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు యత్నం

ఏపీలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు కొందరు యత్నించారు. సర్వే నంబర్‌ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు వచ్చారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉన్న స్థలంలో రాతి కూసాలు ఏర్పాటు చేస్తున్నారు.

BABU Lands
BABU Lands
author img

By

Published : Feb 18, 2022, 11:59 AM IST

చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జాకు యత్నం

Chandrababu land Capture : ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబునాయుడు కుటుంబానికికు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మరొకరు కబ్జా చేసేందుకు యత్నించారు. 1989లో సర్వే నంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు కొనుగోలు చేశారు. ఆయన తదనంతరం ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. మిగిలిన 38 సెంట్ల భూమి వారి పేరు మీద ఆన్​లైన్​లో నమోదు చేసుకోకపోవడంతో.. అదే అదనుగా భావించిన రాజేంద్ర నాయుడు.. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉన్న స్థలంలో రాతి కూసాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ భూమికి సంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉండడంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ... చంద్రగిరి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో ఏటా నారా భువనేశ్వరి... సంక్రాంతి పర్వదినాన రంగవల్లులు, క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చూడండి : AP High Court On Social Media : న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.