తెలంగాణ మలి దశ పోరాట యోధుడు పొట్టిగారి రమేశ్ గంగపుత్ర 9వ వర్థంతి కార్యక్రమాన్ని గంగపుత్ర చైతన్య సమితి నిర్వహించింది. అంబర్ పేట రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమేశ్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ అమరుడు రమేశ్ కాంస్య విగ్రహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఆయన పేరుతో నామకరణం చేయాలని సంఘ నేతలు తీర్మానించారు.
త్వరలో వినతి పత్రాలు...
త్వరలోనే ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సహా కామారెడ్డి ఎమ్మెల్యేకు ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చైతన్య సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ బెస్త తెలిపారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామానికి చెందిన రమేశ్ తెలంగాణ రాష్ట్ర సాధానే లక్ష్యంగా రైలును ఢీకొని ప్రాణాత్యాగం చేశారని సమితి సలహాదారుడు పూస ఋనర్సయ్య బెస్త గుర్తు చేసుకున్నారు.
ఇవీ చూడండి : 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'