అక్రమ వెంచర్లకు సహకరించి.. అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన తప్పుతో సామాన్యులు బలైపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలోని తట్టిఅన్నారం గ్రామంలో పర్యటించిన చాడ.. నీట మునిగిన ఇళ్లు, నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను, వరదల వల్ల రోడ్డున పడిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చాడ వెంకట్ రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు ఉన్నారు.
- ఇదీ చదవండి : రానున్న కాలంలో రెట్టింపు వర్షాలు