ETV Bharat / state

ముగిసిన కేంద్ర బృందం పర్యటన... కరోనా కట్టడి చర్యలపై సంతృప్తి - హైదరాబాద్​లో కేంద్ర బృందం పర్యటన

రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండునెలలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్రప్రభుత్వానికి కేంద్రబృందం సూచించింది. వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం సహా బాధితుల గుర్తింపు, చికిత్స నిర్వహణపై మరింత దృష్టి సారించాలని స్పష్టంచేసింది.

central team visiting completed in telangana
ముగిసిన కేంద్ర బృందం పర్యటన... కరోనా కట్టడి చర్యలపై సంతృప్తి
author img

By

Published : Jun 30, 2020, 4:49 AM IST

కరోనా నివారణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలన లక్ష్యంతో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం..... హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రానికొచ్చిన బృందం...... సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది. తొలుత కరోనా చికిత్సకోసం......గచ్చిబౌలీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్​ను సందర్శించింది. అక్కడి ఐసోలేషన్‌ వార్డు, ఐసీయూ గదులను పరిశీలించింది. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి సదుపాయాలు, వైద్య సేవలు....... హోం క్వారంటైన్‌కు తరలించిన, డిశ్చార్జి అయిన వారి వివరాలు పరిశీలించింది. ఐసీయూలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితితోపాటు టెస్టుల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగితెలుసుకుంది. తర్వాత ముషీరాబాద్‌ డివిజన్‌ పరాన్‌బస్తీలో పర్యటించిన బృందం..కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై ఆరాతీసింది. చివరగా దోమల్‌గూడలోని దోభీగల్లీ కంటైన్‌మెంట్‌జోన్లలోని 26 ఇళ్లను పరిశీలించారు. మరో నలుగురికి పరీక్షలు జరుపుతున్న తీరును తెలుసుకున్నారు.

అప్రమత్తంగా ఉన్నాం...

క్షేత్రస్థాయి పర్యటన తర్వాత సచివాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్​ సోమేశ్‌ కుమార్‌, జీహెచ్​ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో కేంద్ర బృందం సమావేశమైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై......... విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడిపై వైద్యశాఖ అధికారులు..........దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్యసంరక్షణ పరికరాల సమీకరణ, వ్యాధి నివారణ చర్యలపై.... కేంద్ర బృందానికి వివరించారు.

కేంద్ర బృందం ఏమిచెప్పిందంటే..

రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం 17,081 పడకలున్నాయని మరింత మెరుగైన చికిత్సకు 4,489 మంది.... అదనపు సిబ్బందిని నియమించినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. మౌలిక సదుపాయాల మెరుగుదలకు...... 475.74 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై........ సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం..ఇతర రాష్ట్రాల క్షేత్రస్థాయి పర్యటన అనుభవాన్ని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నియత్రణా చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంపు, వైరస్‌ సోకిన బాధితుల గుర్తింపు, చికిత్స నిర్వహణపై కేంద్రబృందం పులు సూచనలు చేసింది. రోజురోజుకు కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున రానున్న రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సూచించింది.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.