శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అనే ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర పరిధిలోనిదే అని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలని మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.
విభజన చట్టం ప్రకారం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని తెలిపారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అంశం విభజన బిల్లులో కేసీఆర్ ఎందుకు పెట్టించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని భాజపా, కాంగ్రెస్‌లు చెప్పలేదని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'