ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా నియంత్రణపై సీఎస్​తో సమావేశమైన కేంద్ర అధికారులు - corona updates from telangana central officials

తెలంగాణలో కరోనా నియంత్రణపై సీఎస్ ‌సోమేశ్‌కుమార్‌తో నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌కుమార్‌ పాల్‌, కేంద్ర అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా పరిస్థితులు, అవసరమైన మౌలిక సదుపాయల గురించి చర్చించారు. పలు అంశాలను కేంద్ర అధికారులకు సీఎస్​ వివరించారు.

Central officials meeting with CS somesh on Corona in the state
రాష్ట్రంలో కరోనా నియంత్రణపై సీఎస్​తో సమావేశమైన కేంద్ర అధికారులు
author img

By

Published : Aug 9, 2020, 11:26 PM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణపై సీఎస్​తో సమావేశమైన కేంద్ర అధికారులు

రాష్ట్రంలో కరోనా నియంత్రణపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో నీతిఆయోగ్‌ సభ్యుడు వినోద్‌కుమార్‌ పాల్‌, కేంద్ర అధికారులు సమావేశమయ్యారు. కరోనా దృష్ట్యా సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యావేక్షిస్తున్నారని సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. అనేక అంశాల్లో రాష్ట్రం పురోగతి సాధించిందని.. కరోనా పరీక్షలను సైతం ప్రభుత్వం పెంచిందని సీఎస్​ తెలిపారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ సదుపాయం కలిగిన పడకలను ప్రభుత్వం పెంచిందన్నారు. అవసరమైన సామగ్రి, ఔషధాలను సమకూర్చుకున్నామని, మార్చి నుంచి 4 వేల వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేశామని సోమేశ్ వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులను హితం యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కరోనా నివారణకు సీనియర్‌ అధికారులతో కూడిన బృందం ఏర్పాటు చేశామని కేంద్ర అధికారులకు సీఎస్‌ వివరించారు.

ఇదీ చూడండి : షేక్​పేట్​ తహసీల్దార్, ఆర్‌ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.