సమర్థ భారత్‌గా నిర్మించాలి:
సత్యం, అహింస వంటి విలువైన సిద్ధాంతాలను గాంధీజీ ప్రపంచానికి చాటి చెప్పారని పురుషోత్తం అన్నారు. ఆ సిద్ధాంతాలను నేటి యువతలో మేల్కొల్పడానికి దేశవ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పటేల్ జయంతి అయిన రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున ఈ ర్యాలీలో పాల్గొనటం సంతోషంగా ఉందని పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. భారత్‌ను శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ్ భారత్, సమర్థ భారతదేశంగా నిర్మించాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందన్నారు.