ETV Bharat / state

బర్డ్ ఫ్లూ కలవరం... అప్రమత్తమైన అటవీశాఖ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు వన్యప్రాణి విభాగం సూచనలు చేసింది. తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించింది.

central-government-suggestions-on-bird-flu-to-the-state-governments
బర్డ్ ఫ్లూ కలవరం... అప్రమత్తమైన అటవీశాఖ
author img

By

Published : Jan 6, 2021, 5:34 PM IST

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖలు రాశారు. కేంద్రం ఆదేశాల మేరకు అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను తెలంగాణ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్, పీసీసీఎఫ్ ఆర్.శోభ అప్రమత్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయని పేర్కొంది. ఇందులో వలస పక్షులూ ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్‌ సంస్థలో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కేంద్రం ప్రకటించింది.

తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించింది. పక్షులను పూర్తిస్థాయిలో పెంచడంతోపాటు నిఘా ఉంచాలని కోరింది. ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లోని పక్షులు ఈ వ్యాధి బారినపడినట్లు సమాచారం ఉన్న దృష్ట్యా రాష్ట్ర అటవీ శాఖ అప్రమత్తమైంది.

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్, వరంగల్ కాకతీయ జూ, సంగారెడ్డిలోని మంజీర పక్షి సంరక్షణ కేంద్రం, పాకాల వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం, పాకాల చెరువు, కిన్నెరసాని సరస్సు, ఇతర అటవీ ప్రాంతాల్లో జంతువులు, పక్షుల అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశించారు. ఈ సీజన్‌లో వలస పక్షుల సంచారం ఉంటుందని... వాటిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎవరికైనా సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 18004255364 ఫోన్ చేయాలని ఆమె కోరారు.

ఇదీ చదవండి: 'బర్డ్​ ఫ్లూ' కోసం ప్రత్యేక కంట్రోల్​ రూమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.