ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. 2014 నుంచి 2017 వరకు ఏపీ డిస్కంలు తెలంగాణకు విద్యుత్‌ను సరఫరా చేశాయని పేర్కొంది. దీనికి సంబంధించిన 3441.78 కోట్ల రూపాయల బకాయిలతో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని సూచించింది.
ఇవీ చదవండి: భాజపా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియ చేపట్టిందని రేవంత్‌రెడ్డి ఫైర్