ETV Bharat / state

రూ.21వేల కోట్ల అప్పు కావాలి.. కుదరదు రూ.4వేల 557 కోట్లు మాత్రమే వస్తుంది..! - Revenue of Andhra Pradesh

Loan Eligibility for AP State in First Quarter: అప్పుల భారంలో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వానికి కొత్త రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో కేవలం 4వేల 557 కోట్లు మాత్రమే రుణం పొందేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అధికారులు అనేక రకాలుగా ప్రయత్నించినా.. ఆశించిన మేర కొత్త రుణాలకు అనుమతి దక్కలేదు.

Loan Eligibility for AP State in First Quarter

author img

By

Published : Jan 7, 2023, 8:44 AM IST

Loan Eligibility for AP State in First Quarter: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి అప్పుపుట్టే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఈ ఆర్థిక ఏడాది సాఫీగా ముగియాలంటే దాదాపు 21 వేలకోట్లు అవసరం కాగా.. కేంద్రం కేవలం రూ. 4వేల 557 కోట్లు అప్పు తీసుకునేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ మూడు నెలలు ఈ కొద్దిమొత్తంతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్థిక ఏడాది మొత్తం రూ. 49వేల 860 కోట్ల బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతించగా.. ఇప్పటికే రూ. 45 వేల303 కోట్లు సేకరించింది.

దీంతో మిగిలిన రూ. 4 వేల557 కోట్లు మాత్రమే రుణంగా పొందేందుకు అనుమతులు ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది. చివరి త్రైమాసికంలో 21 వేల కోట్ల అప్పు అవసరమని కేంద్ర ఆర్థికశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నికర రుణ పరిమితికి లోబడే కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకున్న పరిస్థితులను కూడా ఆర్థికశాఖ అధికారులు ప్రస్తావించి.. మరిన్ని అప్పులు ఇవ్వాలని కోరింది. దిల్లీలోనే కొద్దిరోజులుగా మకాం వేసి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాల అప్పులను కొత్త మార్గదర్శకాలతో పర్యవేక్షిస్తోంది.

ఆ ప్రకారం 2016-17నుంచి 2018-19ల మధ్య కాలంలో రాష్ట్రం రూ. 17వేల 923 కోట్లు అదనంగా అప్పులు చేసింది. ఆ అప్పులను మినహాయించి మిగిలిన రుణాలకు మాత్రమే అనుమతులు ఇస్తామని కేంద్రం పదేపదే చెబుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. విడతల వారీగా మినహాయించుకోవాలని కొన్ని సార్లు.. పాత రుణాలు జమ చేసుకోవద్దని ఇంకొన్నిసార్లు చెబుతూ వస్తోంది.

రాష్ట్రానికి 2022-23లో 44 వేల574 కోట్ల నికర రుణ పరిమితిగా తొలుత నిర్ణయించారు. తొలి 9నెలల్లో రూ. 43 వేల303 కోట్ల అప్పుకే కేంద్రం పరిమితం చేసింది. సీపీఎఫ్​ కోసం ప్రభుత్వ వాటా, ఉద్యోగుల వాటాగా చెల్లించే రూ. 4 వేల 203 కోట్లను కూడా రుణంగా అదనంగా ఇస్తామని కేంద్రం పేర్కొంది. విద్యుత్‌ సంస్కరణల అమలు పేరుతో కేంద్రం మరో 2 వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. అన్నీ కలిపి 8నెలల లోపే రాష్ట్ర ప్రభుత్వం రూ. 45 వేల303 కోట్లు రుణంగా తీసుకుంది. దీంతో మిగిలిన రూ. 4 వేల 557 కోట్లకు అనుమతి వచ్చింది.

బహిరంగ మార్కెట్‌ రుణ అనుమతుల కోసం శుక్రవారం అర్థరాత్రి వరకు అధికారులు ఉత్కంఠగా ఎదురుచూశారు. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొనాలంటే, రుణదాతలకు అవసరమైన సమాచారం తెలియజేయాలంటే శుక్రవారమే అనుమతులు రావాల్సి ఉంది. సాధారణంగా రిజర్వుబ్యాంకు శుక్రవారం సాయంత్రానికి ఈ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంటుంది. ఈ వారం కొంత ఆలస్యమైంది. ప్రతి రాష్ట్రం తనకు ఎంత అప్పు కావాలో తెలుపుతూ రిజర్వుబ్యాంకుకు పంపాలి. కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చే అనుమతులు ఆ మొత్తానికి ఉంటేనే రిజర్వుబ్యాంకు ప్రాసెస్‌ చేస్తుంది.

రాష్ట్రం తన అభ్యర్థనలు పంపగా కేంద్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు అనుమతులు రాలేదు. రాష్ట్ర అధికారులు ఆర్‌బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపారు. తమకు 2 వేల కోట్లకు అనుమతులు వస్తాయని, నోటిఫికేషన్‌ కోసం వేచి చూడాలని అభ్యర్థించినట్లు తెలిసింది. దిల్లీలో కేంద్ర ఆర్థికశాఖలో ప్రయత్నాల తర్వాత మూడు నెలల కాలానికి రూ. 4 వేల557 కోట్ల అప్పులకు అనుమతులు లభించాయి. ఆ తర్వాతే ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా 16 వందల కోట్ల మేర జీతాలు చెల్లించాల్సి ఉంది.

ప్రస్తుతం రూ. 2వేల 200 కోట్ల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ లోను, వేస్‌ అండ్‌ మీన్స్‌, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం వెసులుబాటు కలిపి 2 వేల700 కోట్ల వరకు వినియోగించుకున్నట్లు సమాచారం. అంటే రిజర్వుబ్యాంకుకు ఇప్పటికే రూ. 4 వేల900 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది. జనవరి 10న నిర్వహించే సెక్యూరిటీల వేలంలో మరోరూ. 2 వేల కోట్లు రుణం తీసుకోనున్నారు. ఆ మొత్తం జనవరి 11 నాటికి రానుంది. కేంద్రం పన్నుల్లో వాటాగా ప్రతి నెలా రాష్ట్రానికి 2 వేల300 కోట్లు కూడా అదే సమయానికి రానుంది. రెవెన్యూ లోటు గ్రాంటు కింద ప్రతి నెలా వచ్చే రూ. 859 కోట్లతో కలిపి రూ. 5వేల 100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో ఈ నెల రెండోవారం నాటికి ప్రభుత్వం రిజర్వుబ్యాంకు బకాయిలు తీర్చేసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.