బ్యాక్టీరియా ఎదుగుదలకు కారణమవుతున్న ఎంజైమ్‌లను సీసీఎంబీ కనుగొన్నది. సుమారు పదేళ్ల పాటు ఈకోలి బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేసిన సీసీఎంబీ ఇటీవల బ్యాక్టీరియాలోని ఎండో పెప్టిన్సే బ్యాక్టీరియా ఎదుగుదలకు కారణమని తెలిపింది. వాటిని అడ్డుకోగలిగితే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా తెలిపారు. డాక్టర్ మంజులా రెడ్డి ఆధ్వర్యంలో పవన్ అనే పరిశోధకుడు దీనిని ఆవిష్కరించడం విశేషం. ఈ పరిశోధన అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నల్‌కి సైతం ఎంపిక కావటం విశేషం.
ఇవీ చదవండి:'నిజామాబాద్ ఎన్నిక వాయిదా వేయాలని విజ్ఞప్తి'