ETV Bharat / state

సమీర్ మహేంద్రుపై ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు

ED chargesheet against Sameer Mahendru: దిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి సమీర్​ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జి​షీట్​ను పరిగణలోకి తీసుకున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. మూడు వేలపేజీలతో కూడిన మొదటి ఛార్జ్​షీట్​ను ఈడీ నవంబర్ 26న దాఖలు చేసింది. ఛార్జి​షీట్​లోని అంశాలను పరిశీలించిన కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ED chargesheet against Sameer Mahendru
దిల్లీ లిక్కర్ స్కామ్
author img

By

Published : Dec 20, 2022, 9:59 PM IST

ED chargesheet against Sameer Mahendru: ఛార్జిషీట్​లో ఈడీ పేర్కొన్న నిందితులు.. సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం సరఫరా తయారీ సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఛార్జిషీట్​లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సమీర్ మహేంద్రు దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్ పెండింగ్​లో ఉన్నందని కోర్టు తెలిపింది. విచారణ జనవరి 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేరుస్తూ 10వేల పేజీలతో కూడిన సీబీఐ దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్​ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. అందులో పేర్కొన్న ఏడుగురు నిందితులకు సమన్లు జారీ చేయడం సహా అంతా ట్రైయల్​ ఎదుర్కోవాల్సిందేనని అందుకు తగిన పూర్తి ఆధారాలు ఛార్జిషీట్​లో సీబీఐ స్పష్టం చేసిందని ప్రత్యేక కోర్టు తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.