ETV Bharat / state

కరోనా సమయంలో ఆన్​లైన్​ సేవలు ఎంతో మేలు: లక్ష్మీనారాయణ - సీబీఐ మాజీ జాయింట్​ డైరెక్టర్​ వి.వి.లక్ష్మీనారాయణ

త్వరలోనే కరోనా వైరస్​ బారినుంచి విముక్తి పొంది.. సాధారణ జీవనం సాగిస్తామని సీబీఐ మాజీ జాయింట్​ డైరెక్టర్​ వి.వి.లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువులను ఇంటివద్దకే అందించేందుకు రూపొందించిన భాగ్య బాస్కెట్​ గ్రాసరీ మొబైల్​ యాప్​ వెబ్​సైట్​ను ఆయన ప్రారంభించారు.

cbi ex joint director v.v.laxminarayana launched bhagya basket app
కరోనా సమయంలో ఆన్​లైన్​ సేవలు ఎంతో మేలు: లక్ష్మీనారాయణ
author img

By

Published : Jul 30, 2020, 7:21 PM IST

కరోనా వంటి కష్టకాలంలో సాంకేతిక పరమైన ఆన్​లైన్ సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులను ఇంటి వద్దకే అందించేందుకు రూపొందించిన భాగ్య బాస్కెట్ గ్రాసరీ మొబైల్ యాప్ వెబ్​సైట్​ను ఆయన ప్రారంభించారు.

కరోనా సమయంలో ఆన్​లైన్​ సేవలు ఎంతో మేలు: లక్ష్మీనారాయణ

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిత్యవసర వస్తువులు, ఇతర ఉత్పత్తులు ఇంటి వద్దకే అందించడం అభినందనీయమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇలాంటి సేవలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం విధిగా పాటించాలని సూచించారు. త్వరలోనే వైరస్ బారి నుంచి బయటపడి.. సాధారణ జీవితం జీవిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

భాగ్య బాస్కెట్ యాప్ ద్వారా కేవలం నిత్యవసర వస్తువులే కాకుండా.. పండ్లు, మాంసాహార ఉత్పత్తులు సైతం అందించనున్నట్లు సంస్థ ఫౌండర్ హరిమోహన్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: దేశంలో కరోనా రికవరీ రేటు 64.4 శాతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.