ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ రూరల్ పోలీస్టేషన్లో నమోదైన కేసు విషయంలో భార్గవ్‌ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్‌కుమార్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో భూమా భార్గవ్ తనపై దురుసుగా ప్రవర్తించారంటూ... గచ్చిబౌలి పీఎస్‌లో ఎస్సై రమేశ్ ఫిర్యాదు చేశారు. కారు ఆపినట్టే ఆపి తమపైకి పోనిచ్చే ప్రయత్నం చేసి విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 353,336 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసునమోదు చేశారు.
ఇవీ చూడండి : వెనక్కి తగ్గమంటున్న ప్రభుత్వం, కార్మిక సంఘాలు...