Car Registrations Decreased in Telangana 2023 : రవాణాశాఖకు వాహనాల రిజిస్ట్రేషన్లతోనే(Vehicle Registrations) ఆదాయం సమకూరుతుంది. ప్రతి ఏడాది చివరి మాసంలో వాహనాల రిజిస్ట్రేషన్ల గణాంకాలపై అధికారులు దృష్టిసారిస్తారు. తద్వారా రవాణాశాఖ ఆదాయాన్ని అంచనా వేస్తారు. రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలించినప్పుడు రాష్ట్రంలో కొత్త కార్ల రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నట్లు అధికారుల పరిశీలనలో తెలిసింది. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రీల్ నుంచి నవంబర్ వరకు 1.26 లక్షల కొత్త కార్లు రిజిస్ట్రేషన్ అయినట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఇదే సమయం నాటికి ఈ సంఖ్య 1.28 లక్షల వరకు కార్ల రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తుంది.
Transport Department Revenue From Vehicle Registrations : గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సుమారు రెండు లక్షల కొత్త కార్ల రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు తెలుస్తుంది. రవాణాశాఖకు ప్రధానంగా వాహనాల రిజిస్ట్రేషన్లతోనే ఆదాయం సమకూరుతుంది. గతంతో పోల్చితే కొవిడ్ కారణంగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో కార్ల రిజిస్ట్రేషన్లు పుంజుకున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మళ్లీ మందగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో 2018-19లో రిజిస్టర్ అయిన కొత్త, పాత కార్ల సంఖ్య 1.43 లక్షలు, 2019-20లో 1.37 లక్షల రిజిస్ట్రేషన్లు, 2020-21లో 1.32 లక్షల రిజిస్ట్రేషన్లు, 2021-22లో 1.60లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2022-23లో డిసెంబర్ నాటికి 1.62 లక్షల కార్లు రిజిస్టర్ అయ్యాయి. 2022 ఏడాది ఏప్రిల్ నెలలో 14,684 కార్లు, మేలో 14,540, జూన్ లో 16,546, జులైలో 14,854, ఆగస్టులో 16,472, సెప్టెంబర్లో 16,892, అక్టోబర్లో 18,776, నవంబర్లో 15,383 కార్లు ఈ ఏడాదిలో మొత్తం కలిపి 1,28,147 కార్లకు, 2023 ఏడాదిలో ఏప్రిల్లో 12,877 కార్లు, మేలో 16,315, జూన్ 15,793, జులై 14,713, ఆగస్టు 16,660, సెప్టెంబర్ 15,069, అక్టోబర్ 20,085, నవంబర్ 14,825 కార్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాదిలో మొత్తం కార్లు కలిపి 1,26,337 కార్లు రిజిస్టర్ అయ్యాయి.
Vehicles Increasing In Hyderabad : భాగ్యనగరంలో భారీగా కొత్త వాహనాల కొనుగోళ్లు.. ఎక్కువగా అవేనట..!
తగ్గిన కార్ల అమ్మకాలు : గత ఏడాది 2022తో పోల్చితే ఈ ఏడాది తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ -నవంబర్ మాసాంతానికి 4.55 లక్షల ద్విచక్ర వాహనాలు రిజిష్టర్ అయ్యాయి. గత సంవత్సరం ఇదే వ్యవధిలో ఆ సంఖ్య 4.31 లక్షల వరకు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్లతో రాష్ట్ర రవాణా శాఖకు ఈ ఏడాది నవంబర్ నాటికి రూ.3,236.22 కోట్ల ఆదాయం వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రికార్డు స్థాయిలో రవాణాశాఖ ట్యాక్స్ వసూళ్లు.. ఏకంగా రూ. 6,390 కోట్లు
ఇతర రాష్ట్రాల వాహనాలకు టీఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎందుకంటే