హైదరాబాద్లోని ఎర్రగడ్డ పైవంతెనపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మూసాపేట్ నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెన పై బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
మద్యం మత్తులో ఉండి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జనుజ్జయింది. కారు నడిపిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: ఆరుపదుల వయసులో ఏడడుగుల బంధంతో..!