ETV Bharat / state

వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్ కుమార్​​ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ - Ajay Kumar Managing Director of Vaishnavi Hospital died

వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్​​ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అజయ్ కుమార్ ఆత్మహత్యకు ముందు తన మరణానికి కారకులైన వారి పేర్లు సూసైడ్​ నోట్​లో రాసినా..పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అత్మకు శాంతి కలగాలని ఆయన నివాసం నుంచి బీఎన్​ రెడ్డి చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఇందులో అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అతని బలవన్మరణానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. రెండు రోజుల క్రితం తమ ఆస్పత్రి భవనం యజమాని కరుణారెడ్డి, అతని బావమరిది కొండల్​ రెడ్డి, సరస్వతీనగర్​ కాలనీ అధ్యక్షుడు మెగారెడ్డితోపాటు యాంజల్​కి చెందిన శివకుమార్ తనను మానసికంగా వేధించారని లేఖ రాసి... డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ లేఖ, అజయ్ కుమార్ డైరీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vaishnavi Hospital md Ajay Kumar suicide
అజయ్ కుమార్​​ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ
author img

By

Published : Feb 6, 2020, 11:27 PM IST

అజయ్ కుమార్​​ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ

అజయ్ కుమార్​​ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ

ఇదీ చూడండి: గిరిజన బాలుడిపై మంత్రి చిన్నచూపు.. ఏం చేశారంటే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.