హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిష్టాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. బ్రిడ్జి ఏరియల్ వీక్షణం నగర ప్రజలను ఆకర్షస్తోంది.
రంగురంగుల విద్యుత్ కాంతులతో మొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పాటు మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే మాదాపూర్, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం భారీగా తగ్గనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు