ETV Bharat / state

పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించిన బీఆర్​ఎస్ ​- హైదరాబాద్‌లోని వార్‌రూం నుంచి పర్యవేక్షణ - బీఆర్​ఎస్​ లెటెస్ట్​ న్యూస్​

BRS Focus On Poll Management Telangana 2023 : ఓటింగ్‌ సమయం దగ్గర పడటంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అధికార బీఆర్​ఎస్​ దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు అభ్యర్థులతో మాట్లాడడంతోపాటు.. ఫ్లాష్ సర్వేల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రతి ఓటును కీలకంగా భావించి వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ కార్యాచరణకు దీటుగా ముందుకెళ్లాలని బీఆర్​ఎస్​ అధిష్ఠానం నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Telangana Assembly Elections 2023
BRS Eelection Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 8:13 AM IST

క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటూ వ్యూహాలు రచిస్తోన్నా బీఆర్​ఎస్

BRS Focus On Poll Management Telangana 2023 : ఎన్నికల ప్రచారం(Election Campaign Telangana) తుదిదశకు చేరుకున్న తరుణంలో పోల్​ మేనేజ్​మెంట్​పై అధికార బీఆర్​ఎస్​ దృష్టి సారించింది. పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అభ్యర్థులు, ఇన్​ఛార్జ్​లకు గత కొన్నాళ్లుగా దిశానిర్దేశం చేస్తోంది. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన వార్​ రూం నుంచి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులతో నిత్యం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్నారు.

CM KCR Advice To MLA Candidates : ఎమ్మెల్యే అభ్యర్థులతో పార్టీ అధినేత కేసీఆర్ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. రోజుకు పది నుంచి 12 మంది అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ముఖ్య నేతలతోనూ మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీశ్​ రావు కూడా అభ్యర్థులు, ముఖ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా విభేదాలు ఉంటే వాటిని సరిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే కింది స్థాయి నేతలతోనూ మాట్లాడుతూ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో సంక్షేమం ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలి : కేసీఆర్

నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్​ఛార్జ్​ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రతి వంద ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యుల్ని నియమించారు. ఈ బాధ్యులు అందరూ కూడా స్థానికంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు చెందిన వారే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు, కేంద్రాల్లో 50 మందికి ఒకరు చొప్పున బాధ్యులుగా నియమించారు. బాధ్యులు నిరంతరం వారికి కేటాయించిన ఓటర్లతో టచ్​లో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Telangana Assembly Elections 2023 : అవసరమైతే పరిస్థితులను బట్టి అదనంగా కూడా బాధ్యుల్ని నియమించాలని తెలిపారు. అభ్యర్థులు, ఇన్​ఛార్జ్​లు, నేతలతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఫీడ్​బ్యాక్ తెప్పించుకుంటున్నారు. సర్వేలు, ఫ్లాష్ సర్వేల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైనా వీక్​గా ఉన్నట్లు, ఇబ్బందికరంగా ఉన్నట్లు, వెనకబడి ఉన్నట్లు సమాచారం వచ్చినా.. వెంటనే అక్కడి అభ్యర్థులు, ఇన్​ఛార్జ్​లను అప్రమత్తం చేయడంతో పాటు తదుపరి కార్యాచరణపై వారికి దిశానిర్ధేశం చేస్తున్నారు.

ముంబయి, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను నియోజకవర్గాల వారీగా తరలించే ప్రక్రియ పక్కాగా జరగాలని స్పష్టం చేశారు. బాధ్యుల్ని అక్కడకు పంపి మరీ ఓటర్లను రప్పించాలని తెలిపారు. ప్రతి ఓటు కీలకంగా తుది మేనేజ్​మెంట్ జరగాలని అభ్యర్థులు, నేతలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షేతస్థాయిలో అమలు చేస్తున్న వ్యూహాలు, కార్యాచరణను ధీటుగా ఎదుర్కోవాలని.. ఎక్కడా వెనకంజ వేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Telangana Assembly Elections Campaign : అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలని.. అవకాశం ఉన్న ఏ ఓటునూ వదులుకోరాదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. తటస్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వీలైనంత వరకు వారి ఓట్లను ఎక్కువ సంఖ్యలో రాబట్టుకునేలా చూడాలన్నది వ్యూహం. పోలింగ్ రోజు ఉదయమే తటస్థులు, ఇతరులు ఓటు వేసేలా చూడాలన్నది బీఆర్ఎస్​ వ్యూహం. పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసే వారందరూ మధ్యాహ్నం ఓటుహక్కు వినియోగించుకోవాలని నేతలకు సూచించారు.

పువ్వాడ, తుమ్మల పోటీతో ఖమ్మంలో రాజకీయ కాక - నువ్వా నేనా అన్నట్లు ఉద్ధండుల సమరశంఖం

పోస్టల్ బ్యాలెట్​ అంశంలో గందరగోళం - ఓటు హక్కు దూరం చేస్తారని ఉద్యోగుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.