ETV Bharat / state

BRS Campaign in Telangana Assembly Elections : అభివృద్ధి నినాదం.. విపక్షంపై విమర్శల వాదం.. ప్రచారంలో కారు జోరు

BRS Campaign in Telangana Assembly Elections 2023 : ఓ వైపు తొమ్మిదిన్నరేళ్ల పాలన ఫలాలను వివరిస్తూ... మరో వైపు ప్రత్యర్థులపై ప్రధానంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తూ.. సాగుతోంది.. గులాబీ పార్టీ ప్రచార శైలి. అభ్యర్థుల నుంచి అధినేత వరకూ... తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూ.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ దాడి చేస్తూ ప్రసంగిస్తున్నారు. దిల్లీ బానిసలు.. గుజరాత్ గులాంలు కావాలా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ.. మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

BRS Campaign
BRS Top Leaders Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2023, 7:39 AM IST

BRS Top Leaders Campaign అభివృద్ధి నినాదం.. విపక్షంపై విమర్శల వాదం.. కారు రూటే వేరు

BRS Campaign in Telangana Assembly Elections 2023 : పకడ్బందీ వ్యూహాలతో ఎన్నికల బరిలో పోరాడుతున్న భారత రాష్ట్ర సమితి.. ప్రసంగాలపైనా ప్రత్యేక దృష్టి పెడుతోంది. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై... అభ్యర్థుల నుంచి అధినేత వరకూ పక్కా ప్రణాళికలతో ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు భారీగా జనసమీకరణ చేసి తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. సభ పరిసరాలన్నీ గులాబీ మయం చేసి.. కేసీఆర్, కారు గుర్తులతో నింపేస్తున్నారు.

CM KCR Election Campaign 2023 : కేసీఆర్ తన ప్రసంగాల్లో తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తాను పర్యటిస్తున్న నియోజకవర్గంలో జరిగిన మార్పులను గుర్తు చేస్తున్నారు. ఆశీర్వదించి గెలిపించాలని కోరుతూనే మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మళ్లీ గెలిపిస్తే... రానున్న కాలంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు పెంచడంతో పాటు.. బీమా అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు.

BRS Assembly Elections Campaign 2023 : ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లని 'మేనిఫెస్టో'.. వ్యూహం మార్చి, ప్రచార స్పీడ్‌ పెంచిన కారు

Harish Rao Election Campaign 2023 : కేసీఆర్​తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యర్థ పార్టీలపైనా విరుచుకు పడుతున్నారు. తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూనే కాంగ్రెస్, బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపైనే ప్రధానంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్‌ పొరపాటున నమ్మితే.. తెలంగాణ మళ్లీ అంధకారంలోకి వెళ్తోందని ప్రసంగాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో గెలిచి.. ఆరు నెలల్లోనే మోసం చేశారంటూ.. ఆ రాష్ట్ర పరిస్థితులను ప్రచారం చేస్తున్నారు. పదకొండు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు చేయలేని కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్సిస్తే ఎలా చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.

KTR Election Campaign 2023 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తారని.. ఇరవై నాలుగ్గంటల విద్యుత్ సరఫరా ఉండదని ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిపైనా గులాబీ పార్టీ నేతలూ విరుచకుపడుతున్నారు. అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు రేటు అంటూ ధ్వజమెత్తుతున్న బీఆర్ఎస్.. రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్​లో ఉన్నాయని ఎదురు దాడి చేస్తున్నారు. అప్పుడే సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్​ నేతలు బయలుదేరారంటూ ఎద్దేవా చేస్తూ.. స్థిరమైన ప్రభుత్వం కోసం కారు గుర్తుకు ఓటేయాలని కోరుతోంది.

BRS Comments on BJP : బీజేపీపైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదంటూ ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ బంధంపై బీజేపీ ఆరోపణలను తిప్పికొడుతూ.. తమ స్టీరింగ్ తెలంగాణ ప్రజల చేతిలోనే ఉందని.. బీజేపీ స్టీరింగే అదానీ చేతిలో ఉందంటూ ఎదురు దాడి చేస్తోంది. కుటుంబపాలన ఆరోపణలపైనా సమాధానమిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్​లో వారసత్వ నాయకులు లేరా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తారా అని సవాల్ చేస్తున్నారు. కాంగ్రెస్​ను దిల్లీ బానిసలుగా.. బీజేపీను గుజరాత్ గులాంలుగా పోలుస్తోంది. దిల్లీ బానిసలు.. గుజరాత్ గులాంలు కావాలా.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్ కావాలా ఆలోచించుకోవాలని ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు.

Unanimous Resolution in Support of Harish Rao : 'సిద్దిపేట గడ్డ.. హరీశ్‌రావు అడ్డా..' ఏడోసారీ గెలుపు కన్‌ఫార్మ్‌.. ఈసారీ వార్ వన్​సైడే

పలువురు నేతలు బీఆర్ఎస్​ను వీడుతుండటంతో.. కౌంటర్ చేరికలపైనా బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరకు సుధాకర్ వంటి నేతలను సొంతగూటికి తెచ్చి.. ఉద్యమకారులు తమవైపే ఉన్నారనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నం చేస్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ మలిదశ ప్రచార సభలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

CM KCR Tour Schedule 2023 : మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 26న ముందుగా ప్రకటించిన నాగర్​కర్నూలు బదులుగా వనపర్తిలో సభ నిర్వహిస్తారు. ఈనెల 27న గతంలో ప్రకటించిన స్టేషన్​ఘన్​పూర్ బదులుగా మహబూబాబాద్, వర్దన్నపేటలో కేసీఆర్ ప్రజాశీర్వాద సభల్లో పాల్గొంటారు. మిగతావన్నీ యథాతథంగా ఉంటాయి. ఈనెల 15న మేనిఫెస్టో ప్రకటించి.. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున.. ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్ధిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్​లో ప్రజాశీర్వాద సభలు నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్.. ఎల్లుండి నుంచి మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

BRS Assembly Elections Campaign Strategy : వ్యూహాలకు మరింత పదును.. ఆ ఓటర్ల కోసం 'స్పెషల్​ టీమ్స్'​ను రంగంలోకి దించిన బీఆర్​ఎస్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.