ETV Bharat / state

BRS Campaign in Telangana 2023 : ప్రచారంలో కారు జోరు.. ప్రజల్లో జోష్​ నింపుతున్న ముగ్గురు నాయకులు - సీఎం కేసీఆర్​ సభలు

BRS Campaign in Telangana 2023 : ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తూ బీఆర్​ఎస్​ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఓ వైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్​, హరీశ్​రావు, కవిత దూకుడు పెంచారు. ప్రసంగాల్లో అంశాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్​ భరోసా పేరుతో మేనిఫెస్టోను వివరిస్తున్నారు. ఉద్యమాన్ని గుర్తు చేస్తూ.. తొమ్మిదిన్నరేళ్ల పాలన వివరిస్తూ.. కొత్త హామీలు ఇస్తూ.. ఇతర పార్టీల ముఖ్య నేతలపై విరుచుకుపడుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలకు నేడు విరామం ఇచ్చిన కేసీఆర్​.. రేపటి నుంచి నవంబరు 9 వరకు రోజూ నియోజకవర్గాల బాటపట్టనున్నారు.

BRS Leaders Comments on Congress
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 7:44 AM IST

BRS Campaign in Telangana ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుతున్న కారు

BRS Campaign in Telangana 2023 : ప్రచారం జోరు పెంచిన గులాబీ దళపతి.. ప్రజా ఆశీర్వాద సభ(Praja Aahrvada Sabha)లకు ఇవాళ విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు పదమూడు నియోజకవర్గాల్లోని సభల్లో కేసీఆర్​ పాల్గొన్నారు. ఆదివారం నుంచి మళ్లీ నవంబరు 9 వరకు రోజూ పర్యటించనున్నారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో సభలు జరగనున్నాయి. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రసంగిస్తున్నారు. ఉద్యమ ప్రస్థానాన్ని ప్రతీ నియోజకవర్గంలో ప్రస్తావిస్తూ.. రాష్ట్రావిర్భావంలో తన నాయకత్వాన్ని గుర్తు చేస్తున్నారు.

CM KCR Election Campaign in Telangana : తొమ్మిదిన్నరేళ్లలో రైతుబంధు, ఆసరా ఫించన్ల వంటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు వాటి ఫలాలను చెబుతూ.. భూముల విలువ ఎలా పెరిగిందోనని కేసీఆర్​ విశదీకరిస్తున్నారు. కేసీఆర్​ భరోసా పేరిట ఎన్నికల మెనిఫెస్టోను ప్రచారాన్ని బీఆర్​ఎస్​(BRS) విస్తృతం చేస్తోంది. దానికి అనుగుణంగా కేసీఆర్​ కూడా తన ప్రసంగాల్లో మహిళలకు భృతి, నాలుగు వందల రూపాయలకే సిలిండర్, రైతుబంధు, ఫించన్ల పెంపు వంటివి ప్రజలకు వివరిస్తున్నారు.

CM KCR Speech at Paleru Meeting : కాంగ్రెస్ అధికారంలోకి​ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటారు : సీఎం కేసీఆర్

BRS Leaders Comments on Congress : ఒకవైపు చేసింది చెబుతూ.. మేనిఫెస్టోను వివరిస్తూనే.. ప్రత్యర్థులపై ముఖ్యంగా కాంగ్రెస్​పై ప్రతీ సభలోనూ విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులు, విధానాలను విమర్శిస్తున్న గులాబీ దళపతి(KCR).. అప్పుడప్పడు ముఖ్యనేతలపైనా ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. అచ్చంపేటలో రేవంత్ రెడ్డిపై, పాలేరు సభలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విరుచుపడ్డారు. కీలక నేతలు లేని ఇతర నియోజకవర్గాల్లో మాత్రం పార్టీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

"ధరణిని ఎవరైతే తీసి బంగాళఖాతంలో వేస్తామన్నారో.. వాళ్లనే ప్రజలు బంగాళఖాతంలో కలుపుతారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం వస్తే ప్రగతి కొనసాగుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి.- కేసీఆర్​, తెలంగాణ ముఖ్యమంత్రి

Harish Rao Election Campaign in Telangana : కేసీఆర్​తో పాటు.. కేటీఆర్​, హరీశ్‌రావు కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌ను పొరపాటున నమ్మితే.. తెలంగాణ మళ్లీ ఆగం అవుతుందంటూ ప్రసంగాల్లో బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో గెలిచి.. ఆరు నెలల్లోనే మోసం చేశారంటూ.. ఆ రాష్ట్ర పరిస్థితులను ప్రచారం చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్​లోని పరిస్థితులతో పోలుస్తూ చెబుతున్నారు. కేసీఆర్​ మళ్లీ గెలవకపోతే.. తెలంగాణలో అమరావతి పరిస్థితులు తలెత్తి భూముల ధరలు పడిపోతాయన్న ఆందోళన నెలకొందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Harish Rao on Assembly Elections : బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్.. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్​దే : హరీశ్​రావు

CM KCR Next Public Meetings : ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేట, జడ్చర్ల, మేడ్చల్, అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో సభలు పూర్తి చేసిన కేసీఆర్​.. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు.. సోమవారం జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్​లో పర్యటించనున్నారు. నవంబరు 9 వరకు రోజూ నియోజకవర్గాల బాటపట్టనున్నారు. బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)​ నేడు పార్టీ ఎన్​ఆర్​ఐ విభాగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లోని బీఆర్​ఎస్​ ఎన్​ఆర్​ఐ విభాగాల నాయకులతో మాట్లాడి.. ఎన్నికల్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలో వివరించనున్నారు.

CM KCR Wardhannapet Public Meeting Speech : బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోంది : కేసీఆర్

Harish Rao At Ibrahimpatnam BRS Meeting : 'ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్​లు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.