హబ్సిగూడలో టీఎంయూ నేతల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. అశ్వత్థామరెడ్డి లేకుండానే కార్యనిర్వాహక వర్గం భేటీ అయ్యింది. ఈ క్రమంలో టీఎంయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్ రెడ్డి వర్గం అశ్వత్థామరెడ్డి వైఖరిని తప్పుబట్టారు.
కార్మికుల బాగోగులను అశ్వత్థామరెడ్డి పట్టించుకోవట్లేదని థామస్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె తర్వాత నుంచి ఆయన యూనియన్‌కు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన వ్యక్తి.. పదవిలో ఉండటం సబబు కాదని ఆక్షేపించారు. అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అశ్వత్థామరెడ్డి భాజపా తరఫున ఎమ్మెల్సీ పదవి ఆశిస్తూ.. ఆర్టీసీకి నష్టం చేశారని ధ్వజమెత్తారు.