పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో రక్తదాన శిబిరాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. పోలీసులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చారు. అమరవీరులను స్మరిస్తూ ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఎస్సై స్వయంగా రచించి గానం చేసిన పాటల సీడీని మహేశ్ భగవత్ ఆవిష్కరించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని కమిషనర్ పేర్కొన్నారు. మా సేవలు గుర్తించి గవర్నర్ రాచకొండ కమిషనరేట్‌కి బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై