ETV Bharat / state

గాంధీలో బ్లాక్ ఫంగస్ బాధితులు .. వైద్యసేవలపై బంధువుల ఆరోపణలు - బ్లాక్‌ఫంగస్‌

ఎవరి నోట విన్నా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే మాట వినిపిస్తోంది. ఒకవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు కొత్త వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాంధీలో బ్లాక్​ ఫంగస్​తో చికిత్స పొందుతున్న వారి 102కు చేరింది. మరోవైపు రోగులకు చికిత్స అందించడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.

black fungus medical services in Gandhi
గాంధీలో బ్లాక్ ఫంగస్ బాధితులు
author img

By

Published : May 24, 2021, 9:48 AM IST

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ఫంగస్‌ రోగుల సంఖ్య ఆదివారానికి 102కు చేరింది. మరోవైపు రోగులకు చికిత్స అందించడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. సూదిమందులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. యాంటీబయాటిక్‌ మాత్రలు వేస్తున్నారని వాపోతున్నారు. వైద్య పరీక్షల్లోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు.

‘మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చగా.. ఇప్పటివరకు కేవలం మందుబిళ్లలు మాత్రమే వేస్తున్నార’ని ఓ మహిళ బంధువు వాపోయారు. సీటీస్కాన్‌ తలకు తీయాల్సి ఉండగా వేరేచోట తీశారని, ప్రశ్నించగా.. జరిగిన పొరపాటుపై వైద్యసిబ్బంది వారిలోవారే వాదులాడుకున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వైద్యులు రౌండ్స్‌కి రావడం లేదని, నర్సులే చూస్తున్నారని.. వైద్యుల పర్యవేక్షణలేక రోగులకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. అత్యవసర రోగుల చికిత్సకు ప్రాధాన్యం ఉంటుందని, మిగతా రోగులనూ పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

కోఠి ఈఎన్‌టీ నోడల్‌ కేంద్రంలో 260 మంది

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలోని నోడల్‌ కేంద్రంలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య 260కి చేరింది. ఆసుపత్రిలో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా అదనపు పడకలు ఏర్పాటు చేశారు. ఆదివారం సుమారు 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇన్‌పేషెంట్‌లోని విభాగాలన్నీ బాధితులతో నిండిపోయాయి.

ఇదీ చూడండి: కరోనా వేళ ఆపన్న హస్తం.. గౌరవంగా తుది మజిలీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.