ప్రభుత్వం పూర్తి హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ అన్నారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణ విషయంలో ఆంక్షలు విధించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండపాల ఏర్పాటుపై సర్కారు ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు.
కరోనా విజృంభిస్తున్నప్పటికీ రంజాన్, బక్రీద్ సందర్భంగా అనుమతులిచ్చి వినాయక చవితికి మాత్రం నిబంధనల పేరుతో ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంఐఎంకు తొత్తుగా మారిందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో గణేశ్ ఉత్సవాలను నిబంధనలను అనుసరించి నిర్వహించుకుంటామన్నారు.