ETV Bharat / state

దుబ్బాకలో భాజపాదే విజయం: బండి సంజయ్​ - భాజపా

దుబ్బాక ఉపఎన్నికలో భాజపాదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని చెప్పారు. ఒకరు భర్త పేరుతో.. మరొకరు తండ్రి పేరుతో పోటీ చేశారని విమర్శించారు. ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేలు పంచారని ఆరోపించారు.

bjp will win in dubbaka by election: bjp state president bandi sanjay
దుబ్బాకలో భాజపాదే విజయం: బండి సంజయ్​
author img

By

Published : Nov 3, 2020, 7:42 PM IST

Updated : Nov 3, 2020, 9:07 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస మరోసారి అబద్ధాలతో గెలవాలని ప్రయత్నించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. ఉపఎన్నికలో భాజపాదే విజయమన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని చెప్పారు. ఒకరు భర్త పేరుతో.. మరొకరు తండ్రి పేరుతో పోటీ చేశారని విమర్శించారు. ఓటుకు రూ.5 నుంచి 10 వేలు పంచారని ఆరోపించారు. తెరాస కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందన్నారు. తెరాస ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ప్రచారం చేస్తున్నారని.. పోలీసులు లాడ్జీని ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలే తమ ముందున్న లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలేవని ప్రశ్నించారు. హైదరాబాద్​ను డల్లాస్ చేస్తానని చెప్పిన కేసీఆర్​ ఖల్లాస్ చేశారని విమర్శించారు. దుబ్బాక పోలింగ్ సరళి భాజపా గెలుపునకు అద్దం పడుతోందని చెప్పారు. భాజపా కార్యకర్త ఆత్మాహుతికి పాల్పడితే వాడు, వీడు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, నిబద్ధతతో పనిచేసిన అధికారులు, ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.

దుబ్బాకలో భాజపాదే విజయం: బండి సంజయ్​

ఇదీ చదవండి: ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక.. 10న లెక్కింపు

Last Updated : Nov 3, 2020, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.