ETV Bharat / state

'వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి'

లంగర్​హౌజ్​ వరద ప్రభావిత ప్రాంతాలను భాజపా నేతలు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

bjp-visits-langer-house-flood-affected-areas
లంగర్​హౌస్ ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన భాజపా
author img

By

Published : Oct 19, 2020, 2:35 PM IST

హైదరాబాద్​ లంగర్​హౌస్ ముంపు ప్రభావిత ప్రాంతాలను భాజపా నేతలు సందర్శించారు. బాధితులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల జీహెచ్​ఎంసీ అధికారులతో మాట్లాడి బ్రిడ్జికి ఇరు వైపులా బార్ గేట్స్ ఏర్పాటు చేయించారు.

ప్రశాంత్​ నగర్​ వద్ద ఉన్న చిన్న బ్రిడ్జి కారణంగా చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారుతున్నాయని నేతలు ఆరోపించారు. గత వారం రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రశాంత్​ నగర్​ వద్ద పెద్ద బ్రిడ్జి కట్టాలని డిమాండ్​ చేశారు.

కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, కార్వాన్ కన్వీనర్ గోవర్ధన్, సిటీ సెక్రటరీ వినేష్ సింగ్, ఇంద్రసేనారెడ్డి, పూర్ణచంద్రరావు, అర్పన్, డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర ప్రకాష్ రెడ్డి, శివ కరణ్ సింగ్, సుధీర్ యాదవ్, సంతోష్, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.