ETV Bharat / state

NVSS PRABHAKAR: 'సీఎం చర్యలతో తెలంగాణకు అవమానం, నష్టం..' - nvss prabhakar allegations on trs government

కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలకు సీఎం కేసీఆర్​ హాజరవ్వకపోవడంపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​ చర్యలతో తెలంగాణకు అవమానమే కాకుండా.. నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపైన దాడులు, అత్యాచారాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

NVSS PRABHAKAR
ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​
author img

By

Published : Aug 6, 2021, 8:51 PM IST

కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి రెండు బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసి.. సమావేశాలకు హాజరవ్వాలని చెప్పినప్పటికీ.. సీఎం కేసీఆర్‌ హాజరుకాబోమని చెప్పడంపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చర్యలతో తెలంగాణకు అవమానమే కాకుండా.. నష్టం జరిగే ప్రమాదం ఉందని వెల్లడించారు. కృష్ణానదిపై చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ప్రభాకర్​ ఆరోపించారు. దీనివల్ల తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం చర్యలతో తెలంగాణకు అవమానం, నష్టం: ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి.. సమావేశాలకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం చెబితే.. సీఎం కేసీఆర్​ హాజరవ్వబోం అని చెప్పడం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఏ సమస్య అయినా మాట్లాడుకుంటేనే పరిష్కారం అవుతుంది. ఆయన చర్యల వల్ల రైతులకు అన్యాయం జరుగుతోంది. పుష్కలంగా నీరున్నా రైతులకు కన్నీరే మిగిలింది. -ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ప్రగతి పద్దుతో ప్రభుత్వం రాష్ట్ర అభ్యున్నతికి కట్టుబడి ఉందని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని ప్రభాకర్​ గుర్తుచేశారు. ఈ ప్రగతి పద్దును పూర్తిగా వినియోగించలేదని ఆరోపించారు. తెలంగాణలో దళితులపైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని ప్రభాకర్​ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: Mothkupally narsimhulu: 'దళిత బంధు దేశవ్యాప్తంగా అమలు చేయించగలరా.?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.