రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదుపై భాజపా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆగస్టు 1 నుంచి 7 వరకు సభ్యత్వ వారంగా చేపట్టాలని స్పష్టం చేసింది. ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కమల దళం భావిస్తోంది. ఈ విధంగా రాష్ట్రంలో 13 లక్షల ఇళ్లకు వెళ్లాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 4.8 లక్షల కొత్త సభ్యత్వాలు చేయించినట్లు రాష్ట్ర భాజపా నాయకులు.. ఆ పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించారు. సభ్యత్వ నమోదు ఆగస్టు 11తో పూర్తవనుండగా... అదే నెల 7 నాటికే లక్ష్యాన్ని చేరాలని పార్టీ శ్రేణులకు నడ్డా సూచించారు.
హైదరాబాద్‌పై నజర్
వారం రోజుల పాటు 6,800 మంది పూర్తి స్థాయి కార్యకర్తలు సభ్యత్వ నమోదుకు 13 లక్షల ఇళ్లకు వెళ్లి... ఒక్కో కుటుంబంతో మాట్లాడి పార్టీలో చేరాలని విన్నవిస్తారని భాజపా నేతలు వివరించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేయాల్సిందేనన్న అమిత్‌షా ఆదేశాలకు అనుగుణంగా కృషి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : కేసీఆర్, జగన్‌కు మాజీ సీఐసీ శ్రీధర్ ప్రశ్న