ETV Bharat / state

సీఎం ప్రోద్భలంతో భాజపా కార్యకర్తలపై కేసులు: బండి సంజయ్​ - బండి సంజయ్​ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్భలంతోనే తమ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు.

bjp state president bandi sanjay fire on cm kcr in hyderabad
సీఎం ప్రోద్భలంతో కేసులు: బండి సంజయ్​
author img

By

Published : Feb 20, 2021, 7:25 PM IST

ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే తమ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. న్యాయవాద దంపతుల హత్యపై సీఎం నోరు విప్పకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

సీఎం ప్రోద్భలంతో కేసులు: బండి సంజయ్​

ఇంటిలిజెన్స్ అధికారి ప్రభాకరరావు ద్వారా తెలంగాణలో సీఎం కేసీఆర్ గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభాకరరావు అక్రమ ఆస్తుల చిట్టాను తవ్వుతామని బండి సంజయ్‌ హెచ్చరించారు. గుర్రంపోడు తండా ఘటనలో భాజపా నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీస్ అధికారులకు గాయాలైనందున క్షమాపణలు కోరినట్లు తెలిపారు. భాజపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆపాలన్నారు. అవసరమైతే మళ్లీ గుర్రంపోడు వెళ్తామని స్పష్టం చేశారు. తామేప్పుడు వెళ్లేది.. ఇంటిలిజెన్స్ ప్రభాకర రావు కనుక్కోవాలన్నారు.

ఇదీ చదవండి: స్తంభాన్ని ఢీకొట్టిన ఎయిర్‌ ఇండియా విమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.