ETV Bharat / state

'జూన్​లో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనమివ్వాలి'

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడో నెల కూడా సగం వేతనమే ఇవ్వడాన్ని భాజపా తీవ్రంగా ఖండించింది. లాక్‌డౌన్‌ పేరుతో జూన్‌ నెల వేతనాలను కోత పెట్టడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్ధం పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

bjp state president bandi sanjay demands kcr to give full salary to government employees
'జూన్​లో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనమివ్వాలి'
author img

By

Published : May 29, 2020, 11:00 AM IST

ఆరేళ్లుగా ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం దివాళా తీసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకే లాక్​డౌన్​ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. 2018 నుంచి అమలు చేయాల్సిన వేతన సవరణ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు.

ఏపీ ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతి కూడా తెలంగాణ ఉద్యోగులకు లేకుండా పోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం అప్పులు ఇస్తే తప్ప రాష్ట్రం నడవలేని స్థితికి దిగజార్చిన సీఎం కేసీఆర్‌ నైతికంగా పాలించే హక్కు కోల్పోయారని మండిపడ్డారు.

జూన్​ నెెలలో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.