తెరాస ప్రలోభాలకు గురిచేసినా మేధావులు లొంగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్‌పై జరిగిన దాడిని అయన ఖండించారు. పోలీసుల సమక్షంలో భాజపా నాయకులపై దాడి జరిగిందని వ్యాఖ్యానించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని తాము కోరుకున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. తెరాస ఓటుకు రూ. 10 వేలు పంచుతుంటే భాజపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారని... ఓటమి భయంతోనే తెరాస దాడులకు దిగుతోందన్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరారు. తమ వాళ్లు తిరగబడితే జరగబోయే పరిస్థితులకు తెరాసదే బాధ్యత అని అన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ భాజపాపై పవన్ కల్యాణ్ గుస్సా