న్యాయవాద దంపతుల హత్య కేసును.. ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పట్ట పగలు నడి రోడ్డుపై వందల మంది చూస్తుండగా జరిగిన జంట హత్యలపై.. కేసీఆర్, కేటీఆర్ స్పందించక పోవడం వెనకున్న ఆంతర్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని సంజయ్ పేర్కొన్నారు. కేసును పక్కదారి పట్టించే కుట్ర పట్ల న్యాయవాదులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యకర్తలను అరెస్టు చేయించి.. హత్య వెనకున్న ప్రముఖులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గతంలో తండ్రిని చంపాడు.. ఇప్పుడు తల్లిని కూడా..