ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నుంచి భాజపా టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు తెరాసలో చేరారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కాకుండా ఫిరాయింపుదారులకు టికెట్ ఇవ్వడం పట్ల పలువురు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ భాజపా ఉపాధ్యక్షుడు కొండపల్లి మాధవ్, ఆయన భార్య, నియోజకవర్గ భాజపా మీడియా కన్వీనర్ శివ ముదిరాజ్, దీన్ దయాల్ తదితర నాయకులు పార్టీ అగ్రనేత లక్ష్మణ్ వైఖరి పట్ల మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో తెరాసలో చేరారు.
ఇదీ చదవండి: బేగంబజార్ తెరాస అభ్యర్థి పూజా వ్యాస్ నామినేషన్..