ETV Bharat / state

BJP Seats in Telangana Assembly: తెలంగాణ శాసనసభలో భాజపాకు పెరిగిన బలం

తెలంగాణ అసెంబ్లీలో భాజపా సభ్యుల(BJP Seats in Telangana Assembly) సంఖ్య పెరిగింది. తాజాగా వెలువడిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలతో ఆ సంఖ్య మూడుకు చేరింది. సాధారణ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకు మాత్రమే పరిమితమైన భాజపా... ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలను కలిగిఉంది.

BJP Seats in Telangana Assembly, telangana bjp news
శాసనసభలో భాజపాకు బలం, తెలంగాణ భాజపా వార్తలు
author img

By

Published : Nov 3, 2021, 11:03 AM IST

తెలంగాణ శాసనసభలో భాజపా బలం పెరిగింది. పార్టీ సభ్యుల సంఖ్య(BJP Seats in Telangana Assembly) మూడుకు చేరింది. సాధారణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ఒక్కరు మాత్రమే గెలుపొందగా... గతేడాది నవంబర్​లో జరిగిన ఉపఎన్నికలో దుబ్బాక నుంచి రఘునందన్ రావు విజయం సాధించారు. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఫలితంగా భాజపా శాసనసభ్యుల సంఖ్య మూడుకు చేరింది.

మొన్నటి వరకు తెరాస నుంచి శాసనసభ్యునిగా ఉన్న ఈటల రాజేందర్... ఇకనుంచి భాజపా సభ్యునిగా సభలో ప్రాతినిధ్యం వహించనున్నారు. తెరాస సభ్యుల సంఖ్య 101గా ఉంది. పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​తో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్​తో కలిపి అధికార పార్టీ బలం 104గా ఉంది. మజ్లిస్ సభ్యులు ఏడుగురు, కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు సభలో ఉన్నారు.

  • తెరాస - 101 +3
  • మజ్లిస్ - 7
  • కాంగ్రెస్ - 6
  • భాజపా - 3

ఇదీ చదవండి: Naga Shaurya farm house case: పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.