తెరాసపై రాజీలేని పోరాటం చేస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెరాసను ఎదుర్కొనే శక్తి తమ దగ్గర ఉంది కాబట్టే కాంగ్రెస్ ఓటు బ్యాంకు తమకు మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు మైనార్టీ ఓటు బ్యాంకు లేదని చెప్పారు. ఇప్పటికే ఆ ఓటింగ్ తెరాస, ఎంఐఎంకు మళ్లిందన్నారు. తెలంగాణలో భాజపాకి రెండు సవాళ్లు ఉన్నాయని.. అందులో భాజపాపై ప్రజలకు విశ్వాసం కల్పించడం ఒకటి కాగా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉన్న 29 శాతం ఓట్లను తమవైపు మళ్లించుకోవడం రెండోదని పేర్కొన్నారు.
నామినేటెడ్ పోస్టులు వచ్చినంత మాత్రాన పార్టీ బలపడదని అమిత్ షా ముందే చెప్పారన్నారు. రాంమాధవ్ వేరు... తాను వేరని అన్నారు. తమ మధ్య పోటీ లేనేలేదని మురళీధర్‌రావు చెప్పారు. కేసీఆర్‌ను తాను విమర్శించినంతగా ఎవరూ విమర్శించలేదని పేర్కొన్నారు. తాను కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, కులపరంగా తనకు పెద్దగా పలుకుబడి లేదని తెలిపారు. పార్టీలో 75 సంవత్సరాల రిటైర్మెంట్ నిబంధన సూత్రప్రాయంగా తీసుకున్నది మాత్రమేనని...యడ్యూరప్ప 76 సంవత్సరాలకు సీఎం అయ్యారని గుర్తు చేశారు. గతంలో భాజపా అధ్యక్ష పదవి అవకాశం వచ్చినా వదలిపెట్టినట్లు చెప్పారు.
ఇదీ చూడండి :'కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావాలి'