గ్రేటర్ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల భాజపా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకట స్వామి స్పష్టం చేశారు. ప్రజల మద్దతు, కార్యకర్తల శ్రమతో ముందుకు పోతామన్నారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించే విషయంపై కమిటీ చర్చించిందని తెలిపారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని వివేక్ హామీ ఇచ్చారు. తెరాస మేనిఫెస్టో అమలు కాలేదని దుయ్యబట్టిన వివేక్.. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఎంఐఎం, తెరాస కబంధ హస్తాల నుంచి విడిపిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో ఎంత అధికార దుర్వినియోగం చేస్తే అంతగా ప్రజలు ప్రతిఘటిస్తారని తెలిపారు.
ఇదీ చదవండి: దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవండి: వివేక్