ETV Bharat / state

ఈసీని కలిసిన భాజపా నేతలు.. ఆయా విషయాలపై ఫిర్యాదు - EC notices to Rajagopal Reddy

BJP complained to EC against TRS: ప్రభుత్వం భాజపా నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేస్తున్నారంటూ భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే టీఎన్​జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌.. తెరాస అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారని ఫిర్యాదు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధమని.. అవసమైతే క్రిమినల్‌ కేసులు కూడా పెడతామని భాజపా నాయకులు హెచ్చరించారు.

BJP leaders
BJP leaders
author img

By

Published : Oct 31, 2022, 6:16 PM IST

BJP complained to EC against TRS: మునుగోడు ఉపఎన్నికలో భాజపాను, పార్టీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డిని బదనాం చేసే ఉద్దేశంతో తెరాస నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించినట్లు భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ను కలిసిన భాజపా బృందం.. తెరాస రాజగోపాల్​రెడ్డిపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఖాతాలకు సుశీ ఇన్​ఫ్రా నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదని వారు పేర్కొన్నారు.

ఉపఎన్నికలో టీఎన్​జీవో నేతలు బహిరంగంగా తెరాసకు వత్తాసు పలుకుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఎన్​జీవో అధ్యక్షుడు రాజేందర్‌ సహా నేతలపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. భాజపా నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న భాజపా నేతలు.. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

"టీఎన్​జీవో నేతలు బహిరంగంగా ఎన్నికల్లో ఫలనా పార్టీకి మీరు మద్దతుగా పనిచేయండి అని చెప్పుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం.. అవసమైతే వారిపై క్రిమినల్‌ కేసులు కూడా పెడతాం.. మన దేశంలో బ్యాంకింగ్​ రంగం చాలా సేక్యూరిటీ గలది. ఖాతా దారుడు అనుమతి లేనిది ఏ బ్యాంక్​ కూడా వారి వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి లేదు.. ఎటువంటి లావాదేవీలు చెప్పడానికి వీలు కాదు.. అలాంటింది బయట వ్యక్తులకు ఎలా సమాచారం వెళ్లింది.. ఏ బ్యాంక్​ నుంచి సమాచారం వెళ్లింది.. అనేదానిపై ఆరాతీస్తున్నాం.. వారిపై కూడా ఈసీకి ఫిర్యాదు చేశాం."- ప్రకాశ్‌రెడ్డి, భాజపా సీనియర్‌ నేత

ఈసీని కలిసిన భాజపా నేతలు.. ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.