బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి బండి సంజయ్ అని భాజపా నేతలు విజయరామారావు, బంగారుశృతి, ఎస్.కుమార్ అన్నారు. కోదాడలో ఆయనపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హిందూ దేవతలను కించపరిచిన వారిని ప్రశ్నిస్తే దాడులకు దిగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వేరోస్ సంస్థ అసలు లక్షణాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని భాజపా నేతలు ఆరోపించారు. ఆ సంస్థ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయివేటు సైన్యమని విమర్శించారు. రాడ్లతో దాడి చేయడం నిరసన అవుతుందా అన్న కమలం పార్టీ నాయకులు.. నేరెళ్లలో ఎస్సీ యువకులపై దాడి జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నేరెళ్ల ఎస్సీలు, గుర్రంబోడు గిరిజనుల తరఫున పోరాడుతున్నది బండి సంజయ్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం