పాతబస్తీలోని హిందూ దేవాలయ భూములను అక్రమంగా ఆక్రమిస్తే సహించేది లేదని భాజపా గ్రేటర్ ఉపాధ్యక్షులు టి.ఉమా మహేంద్ర అన్నారు. దేవాలయాల భూములను రక్షించే బాధ్యత తమ కార్యకర్తలపై ఉందని తెలిపారు. కాళీమాత దేవాలయ భూముల కబ్జాదారు లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాళీమాత దేవాలయానికి చెందిన భూముల సర్వే నెంబర్ 24, 25, 26 లో ఎనిమిది ఎకరాల 23 గుంటల స్థలం హైకోర్టు యథాతథంగా ఉండాలని తీర్పునిచ్చారు. అయినప్పటికీ కబ్జాదారు శేరి నరసింహారెడ్డి సిటీ సివిల్ కోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించి పోలీసుల సహకారంతో ఆక్రమణకు యత్నించారని ఆయన వాపోయారు. డీసీపీ స్థాయి అధికారి ప్రదర్శించిన తీరు ఎంఐఎం పార్టీకి కొమ్ముకాస్తున్నారనడానికి నిదర్శనమని అన్నారు
ఇదీ చదవండీ:టీఎస్పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్గా డి.కృష్ణారెడ్డికి బాధ్యతలు