ETV Bharat / state

Muralidhar Rao: రాష్ట్రంలో మార్పు కోసమే సంజయ్ పాదయాత్ర - బండి‌ సంజయ్ పాదయాత్ర పోస్టర్ విడుదల

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ పాదయాత్ర పోస్టర్​ను భాజపా నేత మురళీధరరావు విడుదల చేశారు. రాష్ట్రంలో మార్పు కోసమే సంజయ్ పాదయాత్ర అని స్పష్టం చేశారు.

Muralidhar Rao
Muralidhar Rao
author img

By

Published : Aug 20, 2021, 2:52 PM IST

తెలంగాణలో తాలిబన్ల మద్దతుదారులు ఉన్నారని.. ఎంఐఎం పార్టీ తాలిబన్లకు మద్దతు ఇస్తోందని భాజపా నేత మురళీధరరావు ఆరోపించారు. తెలంగాణలో మార్పు కోసమే బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారని.. తెలిపారు. తెరాస నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దివాళా తీసిందని మండిపడ్డారు.

అవినీతికి మారుపేరుగా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు ఒక కుటుంబం పాదాల వద్ద తాకట్టులో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు సొంత రాష్ట్రంలోనూ.. లాఠీల దెబ్బలు తప్పడం లేదని... తెరాస ప్రభుత్వాన్ని దించగలిగే సామర్థ్యం భాజపాకి మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణలో మిగిలిన పార్టీల డీఎన్​ఏ అంతా ఒక్కటేనని ఆరోపించారు.

తెలంగాణ వచ్చాక ఉద్యోగ అవకాశాలు తగ్గి యువత తీవ్రంగా నష్టపోయిందని.. కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. పదో తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ఏడేళ్లుగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా బండి‌ సంజయ్ పాదయాత్ర ప్రచార పోస్టర్, లోగోను విడుదల చేశారు.

రాష్ట్రంలో మార్పు కోసమే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అవినీతికి మారుపేరుగా కేసీఆర్‌ ప్రభుత్వం తయారైంది. కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. అవినీతికి మారుపేరుగా కేసీఆర్‌ ప్రభుత్వం తయారైంది.

- మురళీధరరావు, భాజపానేత

బండి ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు పక్కా వ్యూహంతో పాదయాత్రకు పూనుకున్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టేందుకు ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. భాజపా రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ నేతృత్వంలో సాగే తొలి విడత పాదయాత్ర ఈ నెల 24న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర సెప్టెంబర్‌ 17న హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభతో ముగించేలా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. పాదయాత్రను విజయవంతం చేయడం కోసం పాత, కొత్త నాయకులతో 29 కమిటీలను వేశారు. ఇప్పటికే ఆయా కమిటీలు తమ తమ పనుల్లో నిమగ్నమై రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశాయి.

Muralidhar Rao: రాష్ట్రంలో మార్పు కోసమే సంజయ్ పాదయాత్ర

ఇదీ చూడండి: Bandi sanjay: దళిత బంధు సభకు మీడియాను ఎందుకు అనుమతించరు.?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.