సభ్యసమాజం తలదించుకునేలా రాష్ట్ర రాజధానిలో పశు వైద్యురాలి హత్య జరగడం దురదృష్టకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేద వ్యక్తం చేశారు. రోజురోజుకూ యువతుల అదృశ్యం కేసులు పెరిగిపోతున్నాయని వాపోయారు. యువతి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే సంబంధిత పోలీసు అధికారులు చులకనగా మాట్లాడం బాధాకరమన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. మంత్రులు కూడా బాధ్యత లేకుండా అధికారులను వెనుకేసుకురావడం సరైనది కాదని లక్ష్మణ్ మండిపడ్డారు
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. మద్యం దుకాణాలను కట్టడి చేయాలని కోరుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం