ETV Bharat / state

ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: లక్ష్మణ్​ - bjp praja sangrama yatra

Lakshman comments on KTR: భాజపా ప్రజా సంగ్రామ యాత్రనుద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు ఆ పార్టీ నేత లక్ష్మణ్​. ప్రజా సంగ్రామ యాత్ర గురించి కేటీఆర్​ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు. తెరాస పడవ మునిగిపోతుందనే భయంతోనే బహిరంగ లేఖ విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో తెరాస పాలనకు ఈ పాదయాత్ర నాంది కాబోతుందని లక్ష్మణ్​ ధీమా వ్యక్తం చేశారు.

praja sangrama yatra
భాజపా నేత లక్ష్మణ్, ప్రజా సంగ్రామ యాత్ర
author img

By

Published : Apr 15, 2022, 5:08 PM IST

Updated : Apr 15, 2022, 5:42 PM IST

Lakshman comments on KTR: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తెరాస ఓర్వలేకపోతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్​లో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. వెనుకబడిన పాలమూరు ప్రజలను తెరాస దగా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని.. ప్రాజెక్టుల పేరుతో దండుకోవాలనేదే ప్రభుత్వ ధ్యాస అని విమర్శించారు. హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​తో కలిసి లక్ష్మణ్​ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: లక్ష్మణ్​

రైతులకు కరెంటు కోతలు.: రాష్ట్రంలో తెరాస పాలన అంతానికి ప్రజా సంగ్రామ యాత్ర నాంది కాబోతుందని లక్ష్మణ్​ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారును ప్రజలు కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర గురించి మంత్రి కేటీఆర్​ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు. తెరాస పడవ మునిగిపోతుందనే భయంతో.. కేటీఆర్ లేఖ రాశారని ఎద్దేవా చేశారు. రైతులు వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్​.. పంట చేతికొచ్చే సమయంలో కేవలం 7 గంటలు మాత్రమే విద్యుత్​ సరఫరా చేస్తున్నారని లక్ష్మణ్​ ఆరోపించారు. రైస్‌ మిల్లులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారని విమర్శించారు. అందుకే రైతులు రోడ్లమీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెరాస, మజ్లిస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వేర్వేరు కాదని.. ఈ మూడు పార్టీలను ప్రశాంత్‌ కిశోర్‌ సమన్వయం చేస్తున్నారని అన్నారు.

"ఇంటికొక ఉద్యోగం అన్నారు.. లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కేజీ టు పీజీ విద్య హామీని గాలికొదిలేశారు. ప్రజాసంగ్రామయాత్ర గురించి కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. తెరాస పడవ మునిగిపోతుందనే భయంతోనే కేటీఆర్​ లేఖ విడుదల చేశారు. తెరాస, మజ్లిస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వేర్వేరు కాదు. ఈ మూడు పార్టీలను ప్రశాంత్‌ కిశోర్‌ సమన్వయం చేస్తున్నారు. ప్రజాసంగ్రామయాత్ర తెరాస పాలన అంతానికి నాంది కాబోతోంది." -లక్ష్మణ్​, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

కేసీఆర్ మాట తప్పారు.. : కృష్ణా పుష్కరాల సమయంలో జోగులాంబ ఆలయాన్ని కేసీఆర్ సందర్శించి... అభివృద్ధి చేస్తామని ప్రకటించారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ గుర్తు చేశారు. జోగులాంబ ఆలయం ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మంత్రివర్గంలో పనిలేని, పనికిరాని మంత్రులు ఎక్కువయ్యారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పటడుగులు వేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నీటి వాటా పెంచడంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైందన్న ప్రభాకర్​.. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని వెల్లడించారు.

కేటీఆర్​ ఏమన్నారంటే..: కుట్రలు చేసిన వాళ్లే కపట యాత్రలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​నుద్దేశించి మంత్రి కేటీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ చేపట్టిన మలిదశ ప్రజాసంగ్రామయాత్రపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్రేనన్న కేటీఆర్​.. పాలమూరులో అడుగుపెట్టే హక్కు లేదని దుయ్యబట్టారు. విభజన హామీలు నెరవేర్చకుండా.. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అంటేనే భాజపాకు గిట్టదని ఆరోపించారు. కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని కేటీఆర్​ నిలదీశారు.

ఇవీ చదవండి: 'కడుపులో ద్వేషం పెట్టుకుని కపటయాత్రలు చేస్తే ఏం లాభం..?'

పెళ్లిని అడ్డుకునేందుకు యత్నించిన యువతి.. జట్టుపట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు

నీటి కోసం 2 కి.మీ నడక.. నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి..

Last Updated : Apr 15, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.