కరోనా సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పార్టీ శ్రేణులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భాజపా నేత నవీన్ గౌడ్ కొనుగోలు చేసిన మను బాపూజీ నగర్లో ఆయన ప్రారంభించారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా తమ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రతి కార్యకర్త ముగ్గురి చొప్పున తమ బాధ్యతగా నిత్యవసరాలు అందజేశారని ఆయన వివరించారు. సమాజ సేవ చేయడానికి రాజకీయాలని అడ్డు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ముషీరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో రసాయన ద్రవాన్ని స్ప్రే చేయనున్నట్లు భాజపా నేత నవీన్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి : లక్ష్మణ్ సేవలకు.. కేంద్రం నుంచి ప్రశంసా పత్రం