ETV Bharat / state

మరోసారి రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి ఏపీ సీఎం జగన్​పై..!​

Rajasingh On CM Jagan: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పక్కరాష్ట్ర సీఎం జగన్​పై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ తీరుతో తిరుపతి, ఏపీకి చెడ్డ పేరు వస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారని రాజాసింగ్​ మండిపడ్డారు.

Rajasingh On CM Jagan
Rajasingh On CM Jagan
author img

By

Published : Jul 30, 2022, 5:08 PM IST

Rajasingh On CM Jagan: సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​.. తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశారు. తరచూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్​, కేటీఆర్​తో పాటు తెరాస నేతలపై విరుచుకుపడే రాజాసింగ్​.. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​పై ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ తీరుతో హిందూ దేవుళ్లకు చెడ్డపేరు వస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు. తిరుపతిలోని అలిపిరి చెక్‌ పోస్టు వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర భక్తులు తీసుకోస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యల ఫలితంగా.. మహారాష్ట్ర సోషల్​ మీడియాలో బాయ్​కాట్​ తిరుపతి అంశం వైరల్​ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం.. జగన్​ తప్పుడు నిబంధనలేనని ఆరోపించారు.

బాయ్‌కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. అలిపిరి వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తోంది. శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారింది. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అనటం వైరల్ అవుతోంది. జగన్ తప్పుడు నిబంధనలే ఈ వివాదానికి కారణం. జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసు. - రాజాసింగ్‌, భాజపా ఎమ్మెల్యే

జగన్ తీరుతో తిరుపతి, ఏపీకి చెడ్డ పేరు: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్

జగన్​పై రాజాసింగ్ సంచలన కామెంట్స్​.. ఆ విషయం అందరికీ తెలుసు..!

అలిపిరి వద్ద శివాజీ విగ్రహాలను అడ్డుకోవడంతో ప్రస్తుతం మహారాష్ట్రలో ఇది పెద్ద వివాదంగా మారిందని రాజాసింగ్ తెలిపారు. మహారాష్ట్రలో సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ తిరుపతి అనడం ప్రస్తుతం వైరల్​గా మారిందన్నారు. ఏపీ సీఎం జగన్ తప్పుడు నిబంధనలు తీసుకురావడమే ఈ వివాదానికి కారణమని రాజాసింగ్ ఆరోపించారు.

ఇవీ చదవండి: 15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా..: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

'మహా' గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు.. ముంబయి దేశ ఆర్థిక రాజధాని కాదంటూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.