ETV Bharat / state

మేయర్ పోటీలో భాజపా... తెరాసను అయోమయం చేసే వ్యూహం

author img

By

Published : Feb 10, 2021, 8:39 PM IST

రేపు జరగబోయే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ఈ నేపథ్యంలో మేయర్‌ పీఠం తమకు దక్కకపోయినా.. ఏకగ్రీవంగా తెరాసకు ఆ స్థానం దక్కకూడదని భావిస్తోంది. పార్టీ కార్పొరేటర్లతో సమావేశమైన ముఖ్యనేతలు.. తెరాస అనుసరించే విధానాలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుందని ఆ మేరకు నడుచుకోవాలని విప్‌ జారీ చేశారు. ఈ ఎన్నికతో తెరాస, మజ్లిస్‌ మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతం చేస్తామని కమలనాథులు చెబుతున్నారు.

bjp
bjp

గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన బల్దియా పోరులో కమలనాథులు 149 స్థానాల్లో పోటీ చేసి 48 స్థానాల్లో విజయం సాధించారు. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. తెరాస, భాజపా, మజ్లిస్‌ పోటాపోటీగా సీట్లు సాధించాయి. రేపు జరగబోయే మేయర్‌ ఎన్నికల్లో భాజపా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను పోటీకి దింపుతోంది.

తెరాసకే దాదాపు...

మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకు స్పష్టమైన మెజార్టీ లేకపోయినా... అత్యధికంగా సీట్లు సాధించిన తెరాసకు మేయర్‌ పీఠం దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో తెరాస, మజ్లిస్‌ రహస్య ఒప్పందంతో ముందుకు సాగాయి. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీల వైఖరిని బహిర్గతం చేసేందుకు భాజపా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. చివరిక్షణం వరకు తెరాసను అయోమయం చేయాలని కమలనాథులు యోచిస్తున్నారు.

సీల్డ్ కవర్​లో...

తెరాసలో మేయర్‌ స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉండటం... సీల్డ్ కవర్‌లో పేరును పంపిస్తామనడం వల్ల మేయర్‌ స్థానాన్ని ఆశిస్తున్న వారు అసంతృప్తితో ఉన్నట్లు భాజపా భావిస్తోంది. మేయర్‌ ఎన్నికలోపు పార్టీ కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ఇప్పటికే సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఎత్తుకు పైఎత్తు...

పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని విప్‌ జారీ చేశారు. మేయర్‌ అభ్యర్థిగా రెండోసారి కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆర్‌కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్​రెడ్డిని ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా బీసీని నిలపాలని కమలనాథులు భావిస్తున్నారు. అధికార తెరాస వేసే ప్రతి ఎత్తుగడకు పైఎత్తు వేయాలని యోచిస్తోంది. మొత్తంగా తెరాసను ఇరుకునపెట్టే విధంగా నడుచుకోవాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.

ప్రత్యేక పూజలు...

మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భాజపా కార్పొరేటర్లు ఆసక్తి చూపించడంలేదని సమాచారం. ఎలాగు మేయర్‌గా గెలిచే పరిస్థితి లేదని ఫ్లోర్​లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్​లీడర్‌ లేదా స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం బషీర్‌బాగ్‌లోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భాజపా కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: త్వరలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.