శనివారం రోడ్ షోలలో కేటీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఎస్ఈసీకి భాజపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఎంపీ సోయం బాపురావు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఫిర్యాదు లేఖను సమర్పించారు. కూకట్పల్లి ప్రాంతంలో రోడ్ షోలలో కేటీఆర్ ఎన్నికల కోడ్, కొవిడ్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అనుమతి లేకుండా వందల వాహనాలను ఉపయోగించారని ఫిర్యాదులో వివరించారు.
నగరంలోని బస్టాండ్లు, మెట్రో పిల్లర్లపై ఉన్న తెరాస ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగిస్తున్నారని, ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఎన్నికల నియమ నిబంధలను ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తోందని ఎంపీ సోయం బాపురావు అన్నారు. కేసులు పెట్టాలంటే కేసీఆర్ మీద వందల కేసులు పెట్టొచ్చని తెలిపారు. తమకే నిబంధనలు వర్తిస్తాయా.. పాలకులకు వర్తించవా అని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్: మంత్రి కేటీఆర్