హైదరాబాద్లోని మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ తమ పార్టీకి చెందిన దిమ్మెను అన్యాయంగా తొలగించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కార్పోరేషన్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
భాజపా నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. భారీగా మొహరించిన పోలీసులు పలువురు అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో 29వ వార్డు కార్పొరేటర్ లీలారవి నాయక్ సృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆమెను హాస్పిటల్కు తరలించారు.
ఇదీ చదవండి : రోడ్డు ప్రమాదం.. కారులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్