హైద్రబాద్ పాతబస్తీ కాలాపత్తర్‌లో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటుపడిన వీళ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేసినట్లు సీఐ సుదర్శన్ తెలిపారు. శనివారం స్థానిక జంక్షన్లో తనిఖీలు చేస్తుండగా చోరీ చేసిన ద్విచక్రవాహనంపై తిరుగుతూ పోలీసులకు చిక్కినట్లు వెల్లడించారు.
మొత్తం 9 ద్విచక్రవాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. అనంతరం నిందితులను పట్టుకొన్న సిబ్బందికి బహుమతులు అందించారు.