తెలంగాణ వ్యవసాయరంగంలో సాధించిన పురోగతి చూసి, అధ్యయనం చేయడానికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో బృందం హైదరాబాద్‌కు వచ్చింది. విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి బీహార్ మంత్రి హాజరయ్యారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి మొక్కజొన్న, వరి విత్తనాల దిగుమతికి కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి గల అవకాశాలు, మౌలిక సదుపాయాల గురించి రెండు గంటలపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి... బీహార్ బృందానికి వివరించారు.
ఇవీ చూడండి: 30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది